కపిల్ మిశ్రా వార్నింగ్: కాలర్ పట్టుకుని ఈడ్చుకెళతా

kapilఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు… హవాలా, మనీ లాండరింగ్ తో సంబంధాలున్నయన్నారు ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా. డమ్మీ కంపెనీల నుంచి పార్టీకి విరాళంగా డబ్బులు వచ్చినట్లు కేజ్రీవాల్ చూపెట్టారన్నరు. ఆమ్ ఆద్మీ పార్టీ చూపించిన పార్టీ ఫండ్ లెక్కల్లో కూడా తేడాలున్నయన్నారు కపిల్ మిశ్రా. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ లో ఒక లెక్క… పార్టీ వెబ్ సైట్ లో మరో లెక్క చూపెట్టారన్నారు కపిల్ మిశ్రా. లెక్కలకు సంబంధించిన చెక్ లు, పేపర్లను ఆయన బయటపెట్టారు. కేజ్రీవాల్  ఈ సాయంత్రంలోగ తప్పులు ఒప్పుకోని పక్షంలో తన కాలర్ పట్టుకుని తీహార్ జైలుకు ఈడ్చుకెళతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కపిల్ మిశ్రా

సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా… ప్రెస్ మీట్ లో కళ్లు తిరిగి పడిపోయారు. మాట్లాడుతున్నప్పుడే… సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో  ఆయన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.

కపిల్ మిశ్రా ఆరోపణల వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు ఆప్ నేతలు. మూడేళ్లుగా  బీజేపీ చేస్తున్న ఆరోపణలనే ఇప్పుడు కపిల్ చెబుతున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ ల ఇమేజ్ ను దెబ్బ తీసే పనులు మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు. ఆరోపణల్లో నిజముంటే… రెండున్నరేళ్లుగా ఎందుకు దర్యాప్తు చేయించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు ఆప్ నేతలు.

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా. కేజ్రీవాల్ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. కేజ్రీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి విలువలు, నైతికత లేదన్నారు. తన మీద వస్తున్న ఆరోపణలన్నింటికి కేజ్రీవాల్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు విజేందర్ గుప్తా.

కేజ్రీకి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు.  వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ  గుర్తింపు రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. ఆరోపణలన్నిటి మీద సీబీఐ దర్యాప్తు చేయించాల్నన్నారు కాంగ్రెస్ నేతలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy