హుజురాబాద్ లో ఈటల విజయం

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన లీడింగ్, ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున ఈటల విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికలోనూ గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజురాబాద్ నుంచి విజయాన్ని ముద్దాడారు.

2010లో రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు అంటే పదేండ్లలో అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఈటల రాజేందర్ మరోసారి విజయం సాధించి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy