
ఇక చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమాలోని చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అనే పాట అప్పట్లో సంచలనం…ఈ పాట మాడాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచే వెంకటేశ్వరరావును మాడా అని పిలిచేవారు. ఆడ మగ కాకుండా నంపుసక పాత్రలు వేయడంలో మాడాకు ఆయనే సాటి. వింతైన డైలాగ్ డెలివరీతో మాడా క్యారెక్టర్లకు కేరాఫ్ అయ్యారు వెంకటేశ్వరరావు.
1950 అక్టోబర్ 10 న తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో జన్మించారు వెంకటేశ్వరరావు సినిమాల్లోకి రాకముందు ఆయన విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. ఆయనకు నలుగురు కుమారులు. తన విలక్షణ నటనతో ఎన్నో అవార్డులు…ప్రశంసలు అందుకున్నారు మాడా. అనంతపురంకు చెందిన అనంతకళావాహిని సంస్థ ఆయనకు అభినయకళానిధి బిరుదునిచ్చింది.