
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే.. చరిత్రాత్మక చట్టం చేసే అవకాశం తమ సర్కార్ కు వచ్చిందన్నారు మోడీ. ప్రతీ భారతీయుడు కులం, మతం అనే తేడా లేకుండా.. ఈ రిజర్వేషన్లు పొందుతారని తెలిపారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మోడీ.. అక్కడే స్వదేశీ దర్శన్ స్కీం ను ప్రారంభించారు. 1550 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అవినీతికి తాము అడ్డుకట్ట వేస్తున్నందుకు.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఉందని మోడీ విమర్శించారు. పేదల డబ్బు దోచుకున్న ఎవ్వరినీ వదలబోమని.. అందరికీ శిక్ష పడేలా చేస్తామన్నారు మోడీ. కొద్ది రోజుల క్రితం చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్చుతానంద్ సాహు తల్లిదండ్రులతో.. మోడీ మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
PM in Kerala: The conduct of Kerala LDF govt on Sabarimala issue will go down in history as one of the most shameful behaviour by any party & govt. We knew that communists do not respect Indian history, culture and spirituality but nobody imagined that they will have such hatred. pic.twitter.com/rlQtRbVyMI
— ANI (@ANI) January 15, 2019