కరీంనగర్ జిల్లాలో అండర్ – 19 క్రికెట్ పోటీలు ప్రారంభం

vivekకరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆద్వర్యంలో… SRR గ్రౌండ్ లో అంతర్ జిల్లా అండర్ – 19 క్రికెట్ పోటీలను ప్రారంభించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వివేకానంద్. ఉమ్మడి జిల్లాల మధ్య జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో… కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల జట్లు తలపడుతున్నాయి. మిగిలిన జిల్లాల మధ్య టోర్నమెంట్ మహబూబ్ నగర్ లో జరుగుతోంది. జిల్లాల మధ్య టోర్నమెంట్ల వల్ల స్థానికంగా ఉన్న టాలెంట్ బయటపడుతుందన్నారు వివేకానంద్. ఈ సందర్భంగా కాసేపు ప్లేయర్లతో ఆయన క్రికెట్ ఆడారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy