కరీంనగర్ జెడ్పీకి ఘన సత్కారం

Tula-Uma-krm-zpకరీంనగర్ జిల్లా పరిషత్ కు కేంద్ర సశక్తికరణ్ పురస్కారం లభించింది. జిల్లాలో అంతర్గత రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం, యువతీయువకులకు ఉపాధిలో మెరుగైన సేవలు అందించినందుకు ఈ గౌవరం దక్కిందన్నారు కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తులా ఉమ. ఈనెల 24న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ అవార్డు అందకోనున్నట్టు చెప్పారామె. ఈ అవార్డు కింద సశక్తికరణ్ పుసరస్కార పత్రంతో పాటు జిల్లా పరిషత్ కు రూ.50 లక్షలు అందజేస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ముందున్నందుకు ఈ పురస్కారం లభించిందన్నారామె. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల సాధికారతలో జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం మరువలేనిదన్నారు తులా ఉమ.

మహిళల బతుకమ్మ వేడుకలు, తెలంగాణ ఆవిర్భావ ర్యాలీలు, రాష్ట్ర సాధనకోసం అమరులైన వాళ్లకు నివాళులు, కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషి సల్పినందుకు కేంద్ర బృందం పరిశీలించి.. స్థానిక సంస్థలకు ప్రతి ఏటా ప్రదానం చేసే పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారానికి కరీంనగర్‌ జడ్పీని ఎంపిక చేసింది. 2015-16 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy