కరీంనగర్ జెడ్పీ మీటింగ్ లో గందరగోళం

kmnr-zp-1విమర్శలు, ప్రతివిమర్శలతో కరీంనగర్ జడ్పీ సమావేశం హాట్ హాట్ గా నడిచింది. పెద్దపల్లి ప్రజాభిప్రాయ సేకరణల రైతుల మీద కేసులు పెట్టారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. మొత్తంగా వ్యవసాయం, వైద్యం మీద సుదీర్ఘ చర్చ నడిచింది.

రైతుల మీద కేసులు పెట్టారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలమీద ఎమ్మెల్యే పుట్టమధు గరమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ వాళ్ల మీద మాత్రమే కేసులు పెట్టారని వివరణ ఇచ్చారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో…ఉద్యమాలు చేసిన వాళ్లకు రొకలిబండలు ఎక్కించారని… కాంగ్రెస్ వాళ్లు నరహంతకులని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కామెంట్స్ తో సమావేశం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోపానికొచ్చారు. కాంగ్రెస్ నేతలను నరహంతకులు అనడం సరికాదని…మాటను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో గంగులకు, జీవన్ కు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

అంతకుముందు పొద్దుగాల సమావేశం ప్రశాంతంగా జరిగింది. రైతు సలహా సంఘాలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సభ్యులను ఎలా ఎంపిక చేస్తారో చెప్పాలన్నరు. రైతులకే సభ్యులను ఎన్నుకునే అవకాశం ఇయ్యాలని చెప్పారు. ఎకరాకు నాలుగు వేలు ఇవ్వాలన్న సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.

అయితే రైతు సమన్వయ సంఘాల నియమాకాల్లో రాజకీయ జోక్యం ఉండదన్నారు మంత్రి ఈటల. వ్యవసాయంలో అనుభవముండి తోటి రైతుల సమస్యలు పరిష్కరించగలిగే వారినే సభ్యులుగా నియమిస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను శాశ్వత రైస్ బౌల్ గా నిలబెడతామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy