కరీంనగర్ తో వాజ్ పేయికి విడదీయలేని అనుబంధం

అటల్ బిహారీ వాజ్ పేయితో కరీంనగర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. స్థానికంగా బీజేపీ పునాదులు ఈనాటివి కావు. బీజేపీ పుట్టిన కొత్తలోనే అటల్ బిహారీ వాజ్ పేయి కరీంనగర్ లో పర్యటించారు. ఆ పార్టీకి బలమైన పునాదులు వేశారు. 1980లో పార్టీ ప్రారంభమైన తర్వాత.. పార్టీ విస్తరణలో భాగంగా దేశమంతటా పర్యటించారు వాజ్ పేయి. అలా.. 1982లో కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి హోదాలో వాజ్ పేయి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఆరోజుల్లోనే వాజ్ పేయి సభకు జనం బ్రహ్మరథం పట్టారు. వాజ్ పేయి ప్రసంగాలు… ఆయన కవితలంటే అప్పటికే జనంలో చాలా క్రేజ్ ఏర్పడింది. అటల్ జీ ప్రసంగం వినాలన్న ఆసక్తితో.. భారీసంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేశారు. స్థానిక నాయకులు… అప్పట్లోనే లక్షల్లో నగదును పర్సులో పెట్టి పార్టీ ఫండ్ కింద వాజ్ పేయికి అందించారు. నోట్ల కట్టలను దండగా మార్చి.. వాజ్ పేయి మెడలో వేశారు అభిమానులు. వాజ్ పేయి కరీంనగర్ కు వచ్చిన తొలినాళ్లనాటి ఫొటోలు ఆ జిల్లా వాసులకు గుర్తే. ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నాయకులు, ప్రజలు తమ అభిమాన నాయకుడిని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.

వాజ్ పేయి పర్యటించినప్పటినుంచి… ఇప్పటివరకు కరీంనగర్ లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతూనే ఉంది. 1991లో రెండోసారి వాజ్ పేయి కరీంనగర్ లో పర్యటించారు. అప్పుడు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎడవల్లి జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేశారు అటల్ జీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy