కరీంనగర్ లో ఎయిర్ మెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Airmenకరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ రేపు (మే 1) ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఈ సెలెక్షన్స్ జరుగుతాయి.

హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఈ ర్యాలీకి తరలివచ్చే అవకాశమున్నందును యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

పోస్టులు: ఎయిర్ మెన్ ఉద్యోగాలు

స్థలం: కరీంనగర్ అంబేడ్కర్ గ్రౌండ్ లో (మే 1 నుంచి 3 వరకు)

ఎయిర్‌మెన్ విభాగాలు: టెక్నికల్ పోస్టులు, నాన్ టెక్నికల్ విభాగంలో గ్రౌండ్ ట్రేనింగ్ ఇన్ స్పెక్టర్(GTI), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్(IAFP) పోస్టులకోసం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

అర్హతలు: ఇంటర్మీడియెట్‌ (ఇంటర్ లో 50 శాతం, ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 50శాతం మార్కులుండాలి)
వయసు: 17 నుంచి 21ఏళ్లలోపు వారై ఉండాలి( 1997 జూలై 7నుంచి 2000 డిసెంబర్ 20 మధ్యలో జన్మించి ఉండాలి)

ఎంపిక: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, హెల్త్ చెక్ అప్ ల ద్వారా

ఫిట్ నెస్ టెస్టు: అభ్యర్థులు కనీస ఎత్తు 165 సెం.మీ.

తేదీలు: 

… మే 1 (హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం జిల్లాలకు చెందిన అభ్యర్థుల ఎంపిక)
… మే 3 (ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నల్గొండ, యాద్రాది, సూర్యపేట జిల్లాల అభ్యర్థుల ఎంపిక)
… తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం 10గంటల వరకు హాజరైన అభ్యర్థులు మాత్రమే అర్హులు

మరిన్ని వివరాలకు: www.airmenselection.gov.in

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy