కరీంనగర్ లో కేసీఆర్

24312695_535459366808982_5794097006967071257_nసీఎం కేసీఆర్ బుధవారం (డిసెంబర్-6) కరీంనగర్ జిల్లా తీగలగుట్టలోని తన నివాసానికి చేరుకున్నారు. రాత్రి  ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేస్తారు. రెండ్రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలిస్తారు సీఎం. తర్వాత అధికారులతో సమీక్ష చేయనున్నారు.

గురువారం(డిసెంబర్-7) ఉదయం 9 గంటలకు తీగలగుట్టపల్లి  నుంచి హెలికాప్టర్ లో బయలు దేరి తుపాకులపల్లి బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు సీఎం. అక్కడ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత  మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, శ్రీపురం పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంప్ హౌస్ ను పరిశీలించనున్నారు. సాయంత్రం రామగుండం NTPCకి చేరుకొని, రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం.

శుక్రవారం ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి మేడారం పంపుహౌస్ దగ్గరకు చేరుకుంటారు సీఎం. పనులు పరిశీలించిన తర్వాత రామడుగు మండలంలోని పంపుహౌస్ దగ్గరకు వెళతారు. పనుల తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పంపుహౌజ్ లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటారుకు ఈ నెల 15 న డ్రైరన్ నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాంపూర్ లోని పంపుహౌస్,  మిడ్ మానేరు ప్రాజెక్టులను కూడా చూస్తారు కేసీఆర్. శుక్రవారం సాయంత్రం మళ్లీ హైదరాబాద్  చేరుకుంటారు ముఖ్యమంత్రి. పెద్దపల్లి జిల్లాకు మొదటిసారి వస్తున్న  సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో నిర్మిస్తున్న గోలివాడ పంప్ హౌజ్ ను చూడనున్నారు ముఖ్యమంత్రి. జిల్లాలో సీఎం టూర్ తో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు పంప్ హౌజ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలంతో పాటు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy