కరుణానిధికి మోడీ మంచి దోస్తంట !

‘నరేంద్రమోడీ నాకు మంచి ఫ్రెండు’

అనే మాటలు ఏ చీఫ్ మినిస్టరో అంటే ఆశ్చర్యం లేదు. 89 ఏళ్ళ వయోవ్రద్ధుడైన తమిళనాడు మాజీ చీఫ్ మినిస్టర్ కరుణానిధి అన్న మాటలివి. 63 ఏళ్ళ మోడీని కరుణ ‘దోస్తు’ అన్నాడంటే ఏదో మతలబ్ ఉన్నట్టే. వచ్చే ఎలక్షన్లలో బీజేపీతో పొత్తు పెట్టుకోడానికే కరుణానిధి ఈ ఫ్రెండ్ షిప్ బయటపెట్టారని తమిళనాడులో పేపర్లు రాసేస్తున్నాయి. ప్రస్తుత సీఎం జయలలిత కూడా ఇంతకుముందు మోడీని దోస్తు అనేసింది. ఆ తరువాత పొత్తు కూడా పెట్టుకున్నారు. జయలలిత ఈసారి నేషనల్ పాలిటిక్స్ మీద ద్రుష్టి పెట్టి, డైరెక్టుగా ప్రధానమంత్రే అయిపోదామనుకుంటోంది. మోడీ ఉండగా అది సాధ్యం కాదు కనుక, మూడో ఫ్రంట్ వైపు చూస్తోంది. సో తమిళనాడులో బీజేపీకి దోస్తు దూరమైనట్టే. ఆ ప్లేసులో తమ డీఎం కే పార్టీని సెటిల్ చేసేయాలని కరుణానిధి అనుకుంటున్నట్టు తమిళ పేపర్లు ఊదరగొడుతున్నాయ్ !  మరి మోడీ, ఈ కొత్త దోస్తుని దగ్గరకు తీసుకుంటారో లేదో చూడాల్సిందే.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy