కరుణానిధి ఖననంపై సస్పెన్స్: మెరీనాబీచ్ లోనే అనుమతివ్వాలన్నడీఎంకే


కరుణానిధి అంత్యక్రియలపై డ్రామా కొనసాగుతోంది. మెరీనా బీచ్ లో అన్నాదురై స్మారంకం పక్కనే అంత్యక్రియలు జరపాలని డీఎంకే నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని  పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్ లో స్మారకానికి న్యాయపరమైన అడ్డంకులున్నాయని ఎట్టిపరిస్థితుల్లోనూ…కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి పదకొండున్నర ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ కొనసాగించారు. అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగినా ఎటూ తేలలేదు. మరోవైపు మెరీనా బీచ్ లో ఇకపై ఎవరి అంత్యక్రియలకు అనుమతించొద్దని గతంలో పిటిషన్ వేశారు దొరైస్వామి అనే అడ్వకేట్. అయితే వాదన టైంలో  దొరైస్వామి తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. అంత్యక్రియలపై తనకు ఎలాంటి అభ్యంతరం లేనట్లు తెలిపారు. పిటిషనర్ తన పిటిషన్ వెనక్కి తీసుకోవటంతో కోర్టుకు తమ అభిప్రాయం చెప్పేందుకు కొంత టైం కావాలని కోరింది సర్కార్. దీంతో విచారణను బుధవారం(ఆగస్టు-8) ఉదయం 8 గంటలకు వాయిదా వేసింది కోర్టు.

మరోవైపు మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్  చీఫ్  రాహుల్  గాంధీ సహా పలువురు నేతలు డిమాండ్  చేశారు. కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్ కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy