కరెంట్ కష్టాలకు కొత్త సొల్యూషన్

బీష్మారావు

బీష్మారావు

కరెంట్ కోతలు. ఎండుతున్న పంటలు. మండుతున్నగుండెలు. కానీ వీటన్నింటికి ఆ గ్రామం దూరం. ఖమ్మం జిల్లా వెంకటగిరిలో కరెంట్ లేకుండా పంటలను కాపాడుకుంటున్నాడు…కొప్పెర భీష్మారావు. ఈయన పెద్దగా చదువుకోలేదు. కానీ కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ఆలోచనకు పదును పెట్టాడు. ఊరిలో ఈయనకు 10 ఎకరాల భూమి ఉంది. అందులో రెండు బోర్లు వేయించాడు. నీళ్లు బాగానే పడ్డాయి. అయితే కరెంట్ మాత్రం సరిగా ఉండట్లేదు. దీంతో ఎండుతున్న పంటలు చూసి అల్లాడిపోయాడు ఈ రైతు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలనుకున్నాడు. దానికోసం ఓ కొత్త పద్ధతి  పాటించి చేనుకు నీళ్ళు పెడుతున్నాడు.

ఆ పద్దతి చూద్దాం

ఒక చిన్న జెనరేటర్ ను ట్రాక్టర్ కు ఫిట్ చేశాడు. ట్రాక్టర్ ఇంజిన్ ను ఆన్ లోనే ఉంచి, ఆ పవర్ ను జెనరేటర్ కు ట్రాన్స్ ఫర్ చేసి దాన్నుంచి, మోటార్ కు కరెంట్ అందేలా చూస్తున్నాడు. ట్రాక్టర్ నడిపించడానికి గంటకు లీటరున్నర డీజిల్ ఖర్చవుతోంది. ఒకేసారి రెండు మోటార్లు నడిచినా అంతే డీజిల్ ఖర్చు అవుతుందని చెబుతున్నాడు భీష్మారావు. కరెంట్ కొరతను అధిగమించేందుకు మరికొంతమంది కూడా ఆయన రూటే ఫాలో అవుతున్నారు. భీష్మారావు ప్లాన్ తో ఇప్పుడు గ్రామంలో కరెంట్ కోతలు లేవు. కొత్త టెక్నాలజీతో బాగానే పంటలు పండించుకుంటున్నారు వెంకటగిరి గ్రామస్తులు.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy