కరెంట్ కోసం….గడియారం అరగంట వెనక్కి!

time2దేశంలో కరెంట్ కొరతను తీర్చడానికి కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఏకంగా గడియారంలో టైం ఛేంజ్ చేసి పవర్ ప్రాబ్లమ్స్ కు సొల్యుషన్ చూపిస్తామంటున్నారు. టైం ను దాదాపు అరగంట ముందుకు జరపాలనే ఆలోచనలో ఉంది సెంట్రల్ పవర్ కార్పోరేషన్. ప్రస్తుతం గ్రీనిచ్ మీన్ టైం కంటే ఇండియన్ స్టాండర్ టైం ఐదున్నర గంటల ముందుంది. దీన్ని ఆరుగంటలకు మార్చాలనే ప్లాన్ లో ఉన్నారు అధికారులు. దీని ద్వారా ఏడాదికి 300 కోట్ల యూనిట్ల కరెంట్ సేవ్ చేయవచ్చని చెబుతున్నారు.

అయితే ఈ టైంని ముందుకు జరపడంపై ఎలా సాధ్యమన్న దానిపై చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కానీ… అధికారులు చాలా క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు. దీనితో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవని చెబుతున్నారు బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ స్టడీస్ సైంటిస్ట్ లు. టైంలో ఛేంజెస్ చేస్తే… పనులన్నీ ఒక అరగంట ముందుగా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 గంటలకు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు తొమ్మిదిన్నరకే వెళతారు. ఈవినింగ్ కూడా అరగంట ముందుగానే బయటకు వస్తారు. ఇలా టైంలో మార్పులు చేయడం వల్ల పగటిపూటే ఎక్కువ పని జరిగే అవకాశాలున్నాయి. దీంతో కరెంట్ వినియోగం 15 శాతం వరకు తగ్గిపోతుందని సెంట్రల్ పవర్ కార్పోరేషన్ చెబుతోంది.

ఈ టైం చేంజింగ్ ఏ విధంగా ఉండాలనే దాని రెండు మూడు ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు.

టైం చేంజింగ్ నార్త్, సౌత్ ఇండియాకు వేర్వేరుగా, అలాగే సమ్మర్, వింటర్ లో మరో విధంగా టైం మార్చాలని ఆలోచన చేశారు. దీని ఎఫెక్ట్ రైల్వేలతో పాటు.. రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో.. అయితే అధికారులు ఆలోచనలో పడ్డారు. తమ నిర్ణయంతో ప్రాబ్లమ్స్ వస్తే… పాత టైంనే కంటిన్యూ చేయవచ్చని ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy