కరెంట్ షాక్ తో పులి మృతి..వ్యక్తి అరెస్ట్

నాగ్‌ పూర్: కరెంట్ షాక్ తగిలి పులి మరణించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. వ్యవసాయ క్షేత్రానికి అమర్చబడిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌ కు తాకడంతో పులి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. నాగ్‌ పూర్.. చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారి దగ్గర డిసెంబర్ -8రాత్రి 10 గంటల సమయంలో పులి మృతదేహం కనిపించిందని తెలిపారు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గజేంద్ర నర్వానె.

చనిపోయిన ఆ పులి యుక్త వయస్సుకు దగ్గర్లో ఉందని, డిసెంబర్-9న  పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, విద్యుత్ షాక్‌ తోనే  పులి మృతి చెందిందని రిపోర్టు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే సదరు వ్యవసాయ క్షేత్రానికి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌ ను ఏర్పాటు చేసిన ఆ క్షేత్ర యజమానిని సంబంధిత‌ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy