కర్ణాటక ఎన్నికలు : ఆ ఊళ్లో ఒక్కరూ ఓటు వేయలేదు

VOTEEఆ ఊరు కట్టుబాటుకు ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే. ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇస్తే చాలు ఎగరేసుకుపోయి ఓటు వేసే ఈ రోజుల్లో.. ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. శనివారం (మే-12) కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఊరు ప్రజలంతా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు కల్‌ బూరగి జిల్లాలోని తార్కస్‌ పేట్ గ్రామ ప్రజలు దూరంగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. తమకు గ్రామపంచాయతీ భవనం కట్టించాలని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొర పెట్టుకున్నారు కానీ.. ఆ గ్రామ ప్రజల మొరను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామపంచాయతీ భవనం కట్టించే వరకూ ఓటేయబోమని.. ఆ గ్రామ ప్రజలు ఒకే మాటమీద నిలబడ్డారు. అనుకున్నది సాధించారు. ఆ గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని చెప్పే మన నేతలు.. పల్లెల్ని పట్టుంచుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా కర్ణాటకలో వచ్చే కొత్త ప్రభుత్వం ఆ ఊరికి గ్రామ పంచాయతీ భవనం కట్టిస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy