కర్ణాటక ఎలక్షన్స్ : బీజేపీకి ఈసీ షాక్

amitకర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీ రూపొందించిన మూడు టీవీ యాడ్ లను ఎలక్షన్ కమీషన్ నిలిపివేసింది. ఈ యాడ్ లోని అంశాలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వీఎస్‌ ఉగ్రప్ప ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిలిపివేసిన మూడు యాడ్ లలో జన విరోధి సర్కార, విఫల సర్కార, మూరు భాగ్య ఉన్నాయి..ఇకపై ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో ఈ యాడ్ లను ప్రసారం చేయకూడదని ఈసీ ఆదేశించింది. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం వినూత్న రీతిలో యాడ్లను రూపొందిస్తూ దూసుకెళ్తోంది. త్రీ సినిమాలోని వై దిస్‌ కొలవెరి సాంగ్‌ను.. వై దిస్‌ యడ్యూరప్ప… అంటూ కాంగ్రెస్‌ రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy