కర్ణాటక ఎలక్షన్స్ : RR నగర్ పోలింగ్ వాయిదా

RR NAGARరేపు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగళూరు సిటీలోని రాజరాజేశ్వరీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికను మే-28 కు వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమీషన్ శనివారం(మే-11) ప్రకటించింది.  ఓట్ల లెక్కింపు 31 న జరుగుతుందని తెలిపింది. రెండు రోజుల క్రితం ఈ నియోజకవర్గం పరిధిలోని జాలహళ్లి ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లో 10 వేల నకిలీ ఓటరు ఐడీ కార్డులను ఈసీ స్వాధీనం చేసుకొంది. దీంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాంటూ బెంగళూరు పోలీసులను ఈసీ కోరినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ కేసుని చేధించడానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఆఫ్ ఇండియా చంద్రభూషణ్ ను నియమించినట్లు సంజీవ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy