కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ మృతి

N Dharam Singhకర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధరమ్‌ సింగ్‌ (80) ఇవాళ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధరమ్‌ సింగ్‌ గుండె పోటుతో నేటి ఉదయం 9 గంటలకు మరణించారు. ధరమ్‌ సింగ్‌ 2004 నుంచి 2006 వరకూ కర్ణాటక సీఎంగా పని చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు ధరమ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy