కర్ణాట‌కలో 125 అడుగుల కావేరీ మాత విగ్ర‌హాం

దేశంలో భారీ విగ్రహాల నిర్మాణం జరుగుతోంది. గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో 597 అడుగుల (182 మీటర్లు) సర్దార్ వల్లభాయ్ విగ్రహాం నిర్మించారు.ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్-31న ఆవిష్కరించారు.

తాజాగా కర్ణాట‌క ప్ర‌భుత్వం కావేరీ న‌దిపై 125 అడుగుల ఎత్తు ఉండే కావేరీ మాత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నుంది. దీని కోసం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మాండ్యా జిల్లాలోని కృష్ణ రాజ సాగర్‌ రిజర్వాయర్‌ సమీపంలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. విగ్రహం కింద ఓ మ్యూజియం కాంప్లెక్స్‌ను,రెండు గ్లాస్ ట‌వ‌ర్ల‌ను నిర్మించ‌నున్నారు. సుమారు 1200 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును చేపట్ట‌నున్నారు. దీని కోసం ఇవాళ(బుధవారం) ఆ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి సారా మ‌హేశ్ అధికారుల‌తో భేటీ అయ్యారు. రిజర్వాయ‌ర్ ప‌క్క‌నే నిర్మించే కొత్త స‌రస్సులో కావేరి మాత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు మంత్రి శివ‌కుమార్ తెలిపారు. ఓ ట‌వ‌ర్ త‌ర‌హాలో కావేరి మాత విగ్ర‌హాన్నినిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని వాడ‌నున్నారు. అయితే విగ్ర‌హాల కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, విరాళాలు ఆహ్వానిస్తున్న‌ట్లు మంత్రి శివ‌కుమార్ తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy