కర్నాటకలో ముగిసిన పోలింగ్

Polling-KAకర్నాటక పోలింగ్ సంగ్రామం ముగిసింది. ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలు. ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరారు. ఆరు గంటల వరకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకే 64.5శాతం ఓటింగ్ జరిగింది. మొత్తం ఓటింగ్ 70శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటర్ల బయటకు రావాలని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అదే విధంగా కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు డిస్కొంట్ ఇచ్చి మరీ పోలింగ్ శాతం పెంచటానికి తమ వంతు కృషి చేశాయి. ఓట్ల లెక్కింపు 15వ తేదీ జరగనుంది.

ఎవరూ ఊహించని విధంగా కర్నాటక రాజధాని బెంగళూరు సిటీ ప్రజలు షాక్ ఇచ్చారు. 5 గంటల వరకు కేవలం 40శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది. ఇక బెంగళూరు రూరల్ మాత్రం 60శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగింది. కావేరి జిల్లాలో 72శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రాంనగర్ 65శాతంగా ఉంది.

ఇక 2013 ఎన్నికల్లో 70.23శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ తో పెద్ద తేడా ఉండకపోవచ్చు అంటున్నారు. ఒకటి, రెండు శాతం పోలింగ్ అటూ ఇటూ ఉండొచ్చు అంటున్నారు. పోలింగ్ పూర్తి వివరాలు ఈ రాత్రికి వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy