కర్నాటక ఎలక్షన్స్ : మనీ పవర్ చూపించిన పవర్ మినిస్టర్

DKకర్ణాటక ఎలక్షన్లలో భాగంగా… రామనగర జిల్లాలోని కనకాపుర నియోజకవర్గం నుంచి విద్యుత్ శాఖ మంత్రి  డీకే శివకుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్ 19వ తేదీ దాఖలు చేసిన నామినేషన్‌ పేపర్లలో.. తన పేరిట, భార్య, కూతురు పేరిట ఉన్న మొత్తం ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం విలువ అక్షరాల రూ.730 కోట్లగా తెలిపారు. ఇది అధికారికంగా మాత్రమే.

తన పేరుపై 618 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు తెలిపిన శివకుమార్ తన భార్య, కూతురి పేరుపై 112 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.251 కోట్ల రూపాయలుగా శివకుమార్ తెలిపారు. ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు మూడు రెట్లు పెరిగింది. 2017లో పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు శివ కుమార్‌ సంస్థలపై దాడులు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ఐదేళ్లలోనే 251 నుంచి రూ.730 కోట్ల రూపాయలకు ఆస్తులు పెరిగినట్లు స్వయంగా ఒప్పుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy