కర్నాటక పోలింగ్ : 11 గంటల వరకు 24శాతం ఓటింగ్

karnataka (2)కర్నాటక రాష్ట్రంలో ఓటింగ్ జోరుగా సాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ప్రతి బూత్ దగ్గర ఓటర్లు బారులుతీరి ఉన్నారు. 11 గంటల సమయానికి 24శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు. 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.

ప్రముఖులు అందరూ కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేడీఎస్ అధినేత మాజీ పీఎం దేవెగౌడ హసన్ జిల్లా హోలినరిసిపూర్ పట్టణంలో ఓటు వేశారు. మైసూర్ యువరాజు కృష్ణదత్ మైసూర్ లో ఓటు వేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేశారు. కనకపురలో శ్రీశ్రీ రవిశంకర్, రమణఘరలో జేడీఎస్ నేత కుమారస్వామి కుబుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy