కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం

07KUDSVHI-W072_GHD3_802362eదసరా వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా దేవరగట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 800 అడుగుల ఎత్తులో కొండల్లో వెలిసిన మాలమల్లేశ్వర స్వామికి దసరా రోజు.. భక్తులు జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులను తామంటే తామే తీసుకెళ్లాలంటూ.. ఎనమిది గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు.. కర్రలతో భీకరంగా కొట్టుకుని రక్తం చిందిస్తారు. చీకట్లో జరిగే ఈ భీకర సమరాన్ని చూసేందుకు లక్షలాది మంది కొండలపై తెల్లవార్లు జాగరణ చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అర్థరాత్రి మొదలయ్యే గ్రామోత్సవం.. చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి తెల్లవారిన తర్వాత ఆలయానికి తీసుకొస్తారు. ఆ తర్వాత స్వామికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. దసరా రోజు జరిగే జైత్రయాత్రకు దేవరగట్టు ముస్తాబవుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy