కలర్ ఫుల్ గా పీఎంవో వెబ్ సైట్…

239500-pmo-inline01ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసిన వెంటనే ప్రధాని కార్యాలయం వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. మోడీ ఫొటో, పర్సనల్ డీటెయిల్స్ తో వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు తనకు మధ్య మీడియేటర్ గా ఈ వెబ్ సైట్ ఉపయోగపడుతుందని చెప్పారు. టెక్నాలజీపై తనకు అపారమైన నమ్మకం ఉందని సోషల్ మీడియాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అభిప్రాయాలు పంచుకోవచ్చన్నారు మోడీ.
ప్రధాని వెబ్ సైట్ లో తాను చేపట్టబోయే కార్యక్రమాలు, పర్యటనలు, ప్రభుత్వ పథకాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని వివరించారు. ప్రమాణస్వీకారం చేసిన కొన్ని సెకన్లలోనే పీఎంవో వెబ్ సైట్ పూర్తిగా మారిపోయింది. మోడీ ఫస్ట్ మెస్సేజ్, ఫొటోలతో సైట్ కలర్ ఫుల్ గా మారిపోయింది. అటు కొత్త సెక్షన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో మోడీ పర్సనల్ డీటెయిల్స్ తో పాటు ప్రొఫైల్ ను ఉంచారు. మోడీ అంకితభావం, పట్టుదల ఉన్న నేతగా…. వంద కోట్ల మంది ప్రజల ఆశాదీపంగా అభివర్ణించారు.

మొత్తంమీద టెక్నాలజీని ఒక్క క్యాంపెయిన్ లోనే కాదు పాలనలోనూ యూజ్ చేసుకుంటున్నారు…నమో. అయితే ఇది ఎంత వరకు ఉపయోగపడుతోందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy