కలలోనైనా చూడగలమా : పాతనోట్లకు తుది వీడ్కోలు

old-currency-notesర‌ద్ద‌యిన పాత‌నోట్లను RBI ద‌గ్గ‌ర‌ మార్చుకునేందుకు ఈరోజు (మార్చి31, 2017) చివ‌రి రోజు కావ‌డంతో అన్ని RBI కార్యాలయాల ర‌ద్దీగా క‌నిపించాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్తా దగ్గర జ‌నం పెద్ద సంఖ్య‌లో త‌మ నోట్ల‌ను మార్చుకునేందుకు క్యూలైన్ల‌లో నిల‌బ‌డ్డారు. వేలాది మంది నోట్ల మార్పిడికి వెయిట్ చేస్తున్నారు. రేపటి నుంచి పాతనోట్ల సమాధే. పాత నోట్ల మార్పిడికి ఉన్న వెసలుబాటు నిబంధనలు అన్నీ ఇవాల్టితో ముగుస్తున్నాయి. చాలామంది ఇప్ప‌టికే త‌మ ద‌గ్గ‌ర ఉన్న ర‌ద్ద‌యిన నోట్ల‌ను మార్చుకోవ‌డంలో సక్సెస్ అయిన‌ప్ప‌టికీ ఇంకా కొంద‌రు క్యూలైన్ల‌లో బారులు తీరారు. వీళ్లందరూ నోట్ల మార్పిడి సమయంలో విదేశాల్లో ఉండటం.. దాచిన సొమ్ము మరిచిపోయి ఇప్పుడు బయటపడటం.. ఇలాంటి కారణాలతో RBI దగ్గరకు వస్తున్నారు.

మ‌రికొంద‌రైతే నోట్ల‌ను మార్చుకునేందుకు స‌రైన డాక్యుమెంట్లు త‌మ దగ్గర లేక‌పోవ‌డంతో నిరాశ‌తో వెనుదిరిగారు. కొద్ది రోజులుగా క్యూలైన్ల‌లో నిల‌బ‌డి.. తీరా వారు కౌంట‌ర్ ద‌గ్గ‌ర‌కు రాగానే స‌రైన ప‌త్రాలు చూపించ‌క‌పోవ‌డంతో అధికారులు వారి ద‌గ్గ‌రున్న నోట్ల‌ను తీసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో ఆగ్ర‌హానికి గురైన వారు పాత నోట్ల‌ను అక్క‌డే చించివేసిన దృశ్యాలు RBI ద‌గ్గ‌ర ద‌ర్శ‌నం ఇచ్చాయి. దేశంలోని కొన్ని RBIల దగ్గర మాత్రమే సరైన పత్రాలతో పాతనోట్లను మార్చుకునే వెసలుబాటు కల్పించారు. అది కూడా ఈ రోజుతో ముగుస్తోంది. సో.. ఇక పాతనోట్లకు సమాధే. ఇక కలలోనైనా చూడలేం.

హైదరాబాద్ ఆర్బీఐ దగ్గర మార్చుకునే వెసులుబాటు లేకపోవడంతో.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఢిల్లీ, బెంగళూరు, పూణెల్లో మాత్రమే నోట్లు మార్చుకునే అవకాశం ఉందంటున్నారు ఆర్బీఐ అధికారులు. దీంతో తమ దగ్గర ఉన్న పాత 5 వందలు, వెయ్యి రూపాయల నోట్లు ఏం చేయాలో అర్ధంకాక దిక్కుతోచని స్ధితిలో పడ్డారు.

ఆర్బీఐ దగ్గరకొచ్చిన వాళ్లలో దాచుకున్న డబ్బుతో వచ్చినోళ్ళు కొందరైతే… ఇంట్లో గళ్ళ పెట్టెలో దొరికిన నోట్లతో వచ్చినోళ్ళు మరికొందరు.  తమ దగ్గర ఉన్న పాత నోట్లకు లెక్కలున్నాయని…  ప్రభుత్వం తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy