కలెక్షన్లు చూస్తే ‘ఫిదా’ అవ్వాల్సిందే..!

20139634_154220658482396_1005616993496328582_nమెగా హీరో వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా రాణిస్తోంది. జులై 21న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది దర్శకుడు శేఖర్‌ కమ్ముల సినీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమని అంటున్నారు. అమెరికాలో ఈ చిత్రం 2 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌కు చేరువలో ఉంది.

విభిన్న అభిరుచులు కలిగిన అబ్బాయి, అమ్మాయి మధ్య చిగురించే ప్రేమకథగా శేఖర్‌ కమ్ముల ఈ మూవీని తీర్చిదిద్దారు. తెలంగాణలోని బాన్సువాడ-అమెరికా చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. రాజా, సాయిచంద్‌, శరణ్య ప్రదీప్‌, గీతా భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy