కల్తీ పాలు పట్టివేత

milkకల్తీ…ప్రస్తుతం కామన్ గా విన్పిస్తున్న మాట. ధనార్జనే ధ్యేయంగా ఏ వస్తువునూ వదిలి పెట్టకుండా కల్తీలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇందులో స్వచ్ఛమైన పాలను కూడా కల్తీ చేస్తున్నారు.  హానికరమైన రసాయనాలతో వేలాది లీటర్ల పాలను కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ దందా యాదాద్రి భువనగిరి జిల్లాలో జోరుగా సాగుతోంది.  రోజూ పదివేల లీటర్లకు పైగా కల్తీ పాలను తయారు చేసి హైదరాబాద్ కేంద్రంగా హోటళ్లు, స్వీట్ షాపులకు అమ్ముతున్నారు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో సెంటర్లను నడుపుతున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన బీబీనగర్ భువనగిరి మండలాల్లో సాగుతున్న కృత్రిమ పాల ఉత్పత్తి కేంద్రాలపై రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన డీసీపీ పాలకుర్తి యాదగిరి నేతృత్వంలో పోలీసులు దాడులు చేశారు. ఈ కేంద్రాల నుంచి వేలాది లీటర్ల కల్తీ పాలు, తయారీకి ఉపయోగించే రసాయన ద్రావణాలు, నూనె ప్యాకెట్లు, యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అరెస్టు చేశారు. ఈ కల్తీపాల దందాను నిర్వహించే హైదరాబాద్‌ శివార్లలోని పాలవ్యాపారులేనని తేలింది. స్వచ్ఛమైన పాల విక్రయం లాభసాటిగా లేకపోవడంతో రసాయనాల కల్తీతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్టుగా నిందితులు పేర్కొన్నారు.
ఈ వ్యాపారులంతా రాత్రివేళల్లోనే వివిధ గ్రామాల్లో పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తారు. తర్వాత గుర్తు తెలియని రసాయనాలు మిక్స్‌ చేస్తారు. ఉదయం వరకు ఆ పాలపై గట్టి మీగడ పేరుకుంటుంది. ఆ మీగడను తీసి సాధారణ నీరు, సనఫ్లవర్‌ వంట నూనెలో వేస్తారు. ఈ విధంగా దాదాపు రెండు లీటర్ల మీగడలో 40 లీటర్ల నీటి మిశ్రమం, వంట నూనెను కలిపి గ్రైండ్‌ చేస్తారు. అంతే.. ‘చిక్కటి పాలు’ తయారవుతాయి. చిక్కదనానికి తోడు వెన్నశాతం కూడా అధికంగా ఉండటంతో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. వీటిని హైదరాబాద్‌కు తరలించి అక్కడ హోటళ్లు, మిఠాయి దుకాణాలు, ఇళ్లకు విక్రయిస్తున్నారు. ఈ కృత్రిమ పాలను తాగితే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చిన్న పిల్లలు, గర్భిణులతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులపై తీవ్రమైన దుష్పరిణామాలు చూపుతాయని అంటున్నారు.

4 Responses to కల్తీ పాలు పట్టివేత

 1. Anonymous says:

  Hang them

 2. Anonymous says:

  Shoot them in public

 3. Anonymous says:

  Please show their face to public…

 4. Anonymous says:

  Give to hang this type of fellows don’t give to chance to live in society.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy