కల్యాణలక్ష్మికి లక్ష

kalyana-laxmiపేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోంది. వాటికి భారీగా నిధులు కేటాయిస్తూ అర్హులకు అందిస్తోంది. అంతే కాదు సంక్షేమ ఫలాలు అందేందుకు ఆయా పథకాలకు ఎక్కువగా నిధులను కేటాయించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈ బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేద యువతుల మ్యారేజ్ కోసం ప్రభుత్వ కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల కింద అందిస్తున్న సాయం లక్ష 116 రూపాయలకు పెరగనుంది. ప్రస్తుతం రూ.75 వేల116 సాయం ఇస్తున్నారు. దీన్ని మరో 25 వేల రూపాయలు పెంచాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పెంపుదలకు అనుగుణంగా మార్చిలో వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు. 2014 అక్టోబర్ 2 నుంచి ఈ రెండు పథకాలకు ప్రభుత్వం ప్రారంభించింది. మొదట్లో రూ.50,116 సాయంగా ఇచ్చారు. గతేడాది నుంచి 75వేల 116కి పెంచారు. తాజాగా అది లక్ష రూపాయలు దాటనుంది. ఈ పథకానికి ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పంపుదలతో ఖర్చు మరో రూ.200 కోట్లు పెరుగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy