కల్వకుర్తి ని త్వరగా పూర్తి చేయాలి: హరీశ్

HARISHకల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల పనులన్నింటినీ వచ్చే జూన్‌ వరకు పూర్తి చేయాలన్నారు మంత్రి హరీశ్‌రావు.దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై హరీశ్ హైదరాబాద్ లోని జలసౌధలో  ఇవాళ(మంగళవారం, డిసెంబర్-12) సమీక్ష చేపట్టారు.

వచ్చే జూన్ వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తయ్యేలా నలుగురు సభ్యులతో కూడిన కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అధ్యయనం చేసి ఈ నెల 26లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందించాల్సిందేనన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.

యాసంగి సీజన్‌లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగవుతుందో సమగ్ర అంచనా రూపొందించుకోవాలన్నారు మంత్రి హరీశ్. కల్వకుర్తి పనుల సమీక్షలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy