కల చెదిరింది : ఐదు నిమిషాల్లో పెళ్లి అనగా…..విడదీశారు

nizaమరికొన్ని నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతామనుకున్న ఆ ప్రేమికుల కల కలగానే మిగిలింది. పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకోలేకపోయారు. ఐదు నిమిషాల్లోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. సినిమా టైప్ లో జరిగిన ఈ ఘటన బుధవారం(జూన్-20)  నిజామాబాద్‌ లో జరిగింది.

పెద్దలను కాదని ఆర్య సమాజ్‌ లో పెళ్లి చేసుకోబోతున్న ఓ ప్రేమ జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు.  పెద్ద సంఖ్యలో అమ్మాయి తరపు బంధువులు ఆర్య సమాజ్‌ దగ్గరకు వచ్చి పెళ్లిని ఆపేయ్యాలంటూ ఆర్య సమాజ్‌ సభ్యులను కోరారు. అయితే సమస్య ఏదైనా ఉంటే బయటే తేల్చుకోవాలని వారు చెప్పడంతో వారు ఆ అమ్మాయిని లాక్కెళ్లబోతున్న సమయంలో వరుడు వారికి అడ్డుపడ్డాడు. దీంతో అమ్మాయి తరపు బంధువులు అతడ్ని చావగొట్టారు. వారితో వచ్చేందుకు నిరాకరించిన ఆ అమ్మాయిని కూడా కొట్టి భుజాన వేసుకొని బైక్ మీద ఇంటికి తీసుకెళ్లారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy