
తమిళనాడులోని కాంచీపురానికి చెందిన దేవరాజన్ వ్యవసాయం చేస్తుంటాడు. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఎనిమిదేళ్ల వయసులో రాజన్ మెర్సిడెస్ బెంజ్ కారు చూసి అది కావాలనుకొన్నాడు. అప్పట్లో అతనికి ఆ కారు పేరు కూడా తెలీదు. కానీ ఆ కారుని చూడగానే ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నాడు. అందుకు చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుంటూ రూ.33 లక్షలు పెట్టి బెంజ్ కారు కొని తన కలను నెరవేర్చుకున్నాడు.
చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లలన్నాఅతను సైకిల్ మీదే వోళ్లేవాడు. ఓసారి అతను 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బెంజ్ కారును చూశాడు. “నా జీవితంలో అలాంటి కారును చూడటం అదే మొదటిసారి. కనీసం ఆ కారు పేరు కూడా నాకు తెలీదు. కారు లోగో నాకు చాలా నచ్చింది. దాంతో ఎప్పటికైనా ఆ కారును సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు నా కల నెరవేరింది. కారును సొంతం చేసుకోగలిగాను. ఈ క్రెడిట్ అంతా నా భార్యదే” అన్నాడు ఆ రైతు రాజన్. రాజన్ కథ గురించి తెలిసి బెంజ్ షోరూం డీలర్లు ఎంతో ముచ్చటపడ్డారు. జీవితంలో ఎంతో కష్టపడి మొత్తానికి అనుకున్నది సాధించినందుకు గానూ షోరూం డీలర్లు కేక్ తెప్పించి సెలబ్రేట్ చేశారు.