కళాతపస్వి ‘బాపిరాజు’కు 120 ఏళ్లు

adavi-bapirajuఅడవి బాపిరాజు… తెలుగు నవలకు కొత్త హంగులు దిద్దిన బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాతంత్ర్య సమరయోధుడు, కళాకారుడు. బావా బావా పన్నీరు.. లాంటి గీతంతో తెలుగు జన జీవితాలపై తనదైన ముద్ర వేసిన బాపిరాజు పుట్టింది ఈరోజే. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పుట్టారు బాపిరాజు. లోకల్ స్కూల్లో, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, మద్రాస్ లా కాలేజ్ లలో చదువుకున్నారు.  కొంతకాలం లాయర్ గా ప్రాక్టీస్ చేసి… తర్వాత రచయితగా మారారు. బందర్ నేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. 1944 నుంచి మీజాన్ పత్రిక ఎడిటర్ గా పనిచేశారు. కొంతకాలం బెజవాడ ఆకాశవాణి కేంద్రం అడ్వైజర్ గా ఉన్నారు. ఆయన రాసిన హిమబిందు, గోనగన్నారెడ్డి, నారాయణరావు, కోనంగి లాంటి నవలలు తెలుగుసాహిత్యంలో చిరస్థానం సంపాదించుకున్నాయి. రచయితగానే కాకుండా ఆర్టిస్ట్ గానూ అద్భుత చిత్రాలుగీసిన బాపిరాజు… గుంటూరులో ఆర్ట్స్ ఫౌండేషన్ స్థాపించారు. సముద్రగుప్తుడు, తిక్కన లాంటి ఆయన కళాఖండాలు, విశ్వనాథ కిన్నెరసాని పాటలకు చిత్రాలు గీసింది ఆయనే. సహాయ నిరాకణోద్యమంలో ఏడాది పాటు జైల్లో ఉన్న బాపిరాజు తన అనుభవాలతో తొలకరి అనే నవల రాశారు. సినిమా రంగంలోనూ అడగుపెట్టిన ఆయన మీరాబాయి, అనసూయ, ధ్రువవిజయం అనే సినిమాలకు డైరెక్ట్ చేశారు. బాపిరాజు 1952 సెప్టెంబర్ 22న చనిపోయారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy