కళ్లునెత్తికెక్కితే : మోడీపై జోకులేస్తే.. కేసు పెట్టి పంచ్ ఇచ్చారు

aib teamదేశంలో పేరుగాంచిన కామెడీ షో AIB గ్రూప్ లో ఉన్న సెలబ్రిటీలపై కేసు నమోదు చేసుకున్నారు ముంబై పోలీసులు. ఒక వ్యక్తి రైల్వే స్టేషన్ లో నిలపడి తన ఫోన్ లో నిమగ్నమై ఉన్న ఫోటోను గురువారం(జూలై 13) ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో పెద్ద తప్పేమి లేదు కాని అతను సేమ్ టు సేమ్ మన ప్రధానమంత్రి మోడీ లానే ఉన్నాడు. ఆ ఫోటో పోస్ట్ చేయడమే కాకుండా స్నాప్ చాట్ లో ఉండే ఒక డాగ్ ఫిల్టర్ ను పెట్టి వాండర్ లస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. ముంబై పోలీసులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి తన్మయ్ భట్ చేసిన పోస్ట్ ను పంపగా..వాళ్లు సైబర్ పోలీసులకు ఈ కేసుని అప్పగించారు. చట్టపరమైన సంప్రదింపులు జరిపిన తర్వాత FIR నమోదు చేశారు. IT Act ప్రకారం వాళ్లు చేసిన నేరానికి మూడేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపారు అధికారులు. ఇంత జరిగాక గ్రూప్ లో పోస్ట్ ను డిలీట్ చేశారు AIB సెలబ్రిటీలు.” మేము జోక్స్ మళ్లీ వేస్తాము..డిలీట్ చేస్తాము..మళ్లీ జోక్ చేస్తాము..కావాలంటే క్షమాపణలు చేప్తాము.. మీరు ఏమైనా అనుకోండి..”  అంటూ తన్మయ్ భట్ ట్వీట్ చేశాడు.

tanmay bhat

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy