కవిత ట్విట్ ; మహిళా పైలట్ గా చరిత్ర సృష్టించడం గర్వకారణం

avanipilotఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించింది. ఒంటరిగా యుద్ధ విమానంలో విహరించిన భారత తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత అవనీకి కంగ్రాట్స్ చెప్పారు. మహిళా పైలట్ గా రికార్డు కెక్కడం గర్వకారణం అని ట్విట్ చేశారు కవిత. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మిగ్-21 ఫ్లయిట్‌ను ఆమె విహరించింది.

రెండేళ్ల క్రితం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొత్తం ముగ్గురు మహిళ పైలట్లను ఫైటర్ స్కాడ్రన్‌కు తీసుకున్నారు. భవానా కాంత్, మోహనా సింగ్‌తో అవనీ చతుర్వేది కూడా ఉన్నది. అవనీ మిగ్‌లో విహరించడం భారతీయ వైమానిక దళానికి, దేశానికి ఓ పెద్ద విజయమని ఎయిర్ కమాండర్ ప్రశాంత్ దీక్షిత్ తెలిపారు. బ్రిటన్, అమెరికా, ఇజ్రాయిల్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో మాత్రమే మహిళా యుద్ధ పైలట్ల ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy