కవి కోకిల.. గుర్రం జాషువా 120వ జయంతి

jashuva-tvనవయుగ కవి చక్రవర్తి… అనగానే గుర్తొచ్చే పేరు గుర్రం జాషువా. దళితుడిగా పుట్టినా… కవిగా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా… తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేసిన మహాకవి జాషువా పుట్టింది ఈరోజే. గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబర్ 28న పుట్టారు జాషువా. పేదరికం, కులవివక్ష, మతవివక్షలను ఎదుర్కొంటూనే చదుకున్నారు. మొదట్లో గుంటూరు జిల్లా బోర్డ్ స్కూల్లో తెలుగు పండిత్ గా పనిచేశారు. తర్వాత బ్రిటీషు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ యుద్ధప్రచారక్ సంఘంలో క్యాంపెయినర్ గా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసర్ గా పనిచేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఎన్ని ఉద్యోగాలు చేసినా జాషువా జీవితాంతం కవిగా బతికారు. పరదేశి, గబ్బిలం, కాందిశీకుడు, ముంతాజ్ మహల్, స్వప్న కధ, నేతాజీ, క్రీస్తు చరిత్ర, క్రొత్త లోకం లాంటి ఖండకావ్యాలు రాశారు. నా కథ పేరుతో తన ఆత్మకథను రాశారు. కవికోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి లాంటి బిరుదులు అందుకున్నారు. విశ్వమానవ సందేశాన్ని, సమతా భావాన్ని ప్రచారం చేయడానికి జాషువా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. జాషువా 1971 జులై 24న చనిపోయారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy