కశ్మీర్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జవాన్లు మృతి

armyజమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. రెండు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఆదివారం (ఆగస్టు13)  ఉదయం బందిపోరా జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయాపడ్డారు. ప్రస్తుతం భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

శనివారం (ఆగస్టు12) షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.  ఓ ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి. ఉగ్రవాది మృతదేహాన్ని ఆదివారం (ఆగస్టు13) భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

జైనపొరా జిల్లాలోని అవ్నీరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని 92 బేస్‌ ఆర్మీ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

షోపియాన్ జిల్లాల ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయన్నారు జమ్మూ కశ్మీర్ DGP ఎస్పీ  వైద్. ఎన్ కౌంటర్ల ఇద్దరు జవాన్లు మృతి చెందటంతో పాటు…మరో ముగ్గురికి గాయాలయ్యాయన్నారు. లోపల టెర్రరిస్టుల గ్రూప్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు వైద్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy