కశ్మీర్ లో ఎదురుకాల్పులు : ముగ్గురు ఉగ్రవాదులు మృతి

JAMMU ENCOUNTERశ్రీనగర్ చట్టాబాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దానితో భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో ఓ ఇంట్లో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా  ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ముందు జాగ్రత్తగా చట్టాబాల్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy