కశ్మీర్ లో ఎన్‌కౌంటర్: 8 మంది భద్రతా సిబ్బంది మృతి

fire

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పోలీస్ లైన్స్‌లోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు, నలుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురుకాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

శనివారం (ఆగస్టు26) ఉదయం పుల్వామాలోని జిల్లా పోలీస్‌ లైన్స్‌(డీపీఎల్‌) ఫ్యామిలీ క్వార్టర్స్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాలను ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి బందీలుగా దాదాపు రెండు డజన్ల కుటుంబాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్వార్టర్స్‌లోని వేరే బ్లాక్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులు క్వార్టర్స్‌లో దాగినట్లు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు.

పాక్‌ రేంజర్లు హతం

జమ్ముకశ్మీర్‌లో మరోసారి పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్‌వాల్‌ ప్రాంతంలో పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పాక్‌ రేంజర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy