కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్: 13మంది ఉగ్రవాదులు హతం

kashmir-encounterజమ్మూకశ్మీర్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం(ఏప్రిల్-1) కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్‌ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

షోపియాన్‌ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా దగ్గర ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్‌ జిల్లా దియాల్గాం ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్‌ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు.
భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్‌ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ ఎస్‌పీ వైద్‌ చెప్పారు. మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్‌కౌంటర్లలో గాయపడ్డారు.

25 మంది పౌరులకు పెల్లెట్‌ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్‌ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయి. కచుదూరా ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్‌కౌంటర్ల తో కశ్మీర్‌ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. హురియత్‌ నేతలు సయద్‌ అలీ షా గిలానీ, మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్, యాసిన్‌ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy