కష్టాలు తీరతాయి : బాలానగర్ ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన

ktrహైదరాబాద్  బాలానగర్ చౌరస్తాలో దశాబ్దాలుగా ప్రజలు ట్రాఫిక్‌ సమస్యతో  ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. ప్రజలను ఆ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రూ.400 కోట్లతో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టామని తెలిపారు. గడిచిన పదేళ్లలో ఎక్కడా ఇంత పెద్ద ఫ్లై ఓవర్‌ను ఎవరూ కట్టలేదన్నారు. ఫ్లై ఓవర్‌ను మరింత దూరం పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. శాంతి భద్రతల విషయం లో హైదరాబాద్‌ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందన్నారు.

ఇప్పటి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో 3 వేల కోట్లతో రోడ్లు, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా పదివేల కోట్ల ప్రతిపాదనలున్నాయన్నారు. త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తామన్నారు..ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 4100 యూనిట్లకు అనుమతులిస్తే తెలంగాణకు 70 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయన్నారు. కొత్తగా వచ్చిన పరిశ్రమల ద్వారా  2లక్షల30వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉందని.. క్వాలిటీ ఆఫ్ లివింగ్‌లో కూడా నగరమే బెస్ట్ సిటీగా ఉందన్నారు.

24 గంటలు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే వరద నీళ్లంతా రోడ్లపైకి వస్తున్నాయన్న మంత్రి  కేటీఆర్… దీనంతటికీ గత ప్రభుత్వ పాలనే కారణమని మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే దీనికి కొంత టైం పడుతుందని తెలిపారు.

2019 లో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సహా రాష్ట్ర ప్రజలకు  అందరీకీ తెలుసన్నారు మంత్రి కేటీఆర్.

బాలనగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ వాసుల తాగునీటి అవసరాల కోసం త్వరలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

బాలానగర్ ఫ్లై ఓవర్ తో ఉపయోగం…

బాలానగర్ విమల్ థియేటర్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ మేఘనా కాంప్లెక్స్ వరకు 1.32 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో రూ.282.47 కోట్లు భూ సేకరణకు, రూ.4వందల కోట్లు వంతెన నిర్మాణానికి వ్యయం అవుతుందని అంచనా.. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి సికింద్రాబాద్, మెదక్ జిల్లా వైపు, సనత్‌నగర్, ఫత్తేనగర్ నుంచి జీడిమెట్ల, కూకట్‌పల్లి వైపు అధికంగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రెండు మార్గాల నుంచి వచ్చే వాహనాలతో నర్సాపూర్, ఫత్తేనగర్ జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy