కష్టాల్లో టీమిండియా…భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్


లార్డ్స్ టెస్టుల్లో టీమిండియా కష్టాల్లో పడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత్ విఫలమవ్వటంతో…భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది ఇంగ్లండ్. క్రిస్ వోక్స్ సెంచరీతో 250 పరుగుల ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్ టీమ్. దీంతో మూడో రోజు ఆట మూగిసే టైంకు ఇంగ్లండ్… 6 వికెట్లకు 357 రన్స్ చేసింది.

సెకండ్ టెస్ట్ లో కూల్ గా ఆడుతోంది ఇంగ్లండ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ ను దెబ్బతీసిన రూట్ సేన…భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. వాతావరణం అనుకూలించకపోవటంతో…విఫలమైన భారత బ్యాట్స్ మెన్లు…స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. అయితే ఆదుకుంటారనుకున్న బౌలర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి ఇంగ్లండ్..ఆరు వికెట్ల నష్టానికి 357 రన్స్ చేసింది.

సెకండ్ టెస్ట్ పై పూర్తిగా పట్టు బిగించింది ఇంగ్లీష్ టీమ్. ప్రస్తుతం 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ 159 బాల్స్ లో 120 పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు. అయితే టెస్టు కెరీర్ లో వోక్స్ కి ఇది తొలి శతకం. మరోవైపు బెయిర్  స్టో 144 బాల్స్ 93 రన్స్ చేసి…కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో మూడో రోజు ఆటు ముగిసే టైంకి ఆల్  రౌండర్ స్యామ్ కర్రాన్ 22 , వోక్స్ 120 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు.

ఫస్ట్ రెండు రోజులు…వరుణుడు తీవ్ర అంతరాయం కల్గిస్తే…మూడో రోజు మాత్రం…భానుడు తన ప్రభావం చూపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ కు దిగిన ఇంగ్లండ్ కు మెరుగైన శుభారంభం దక్కలేదు. ఆదిలో భారత పేస్ ఇషాంత్, మహ్మద్ షమీ..స్వింగ్ బౌలింగ్ తో ఇంగ్లండ్ ఓపెనర్లను భయపెట్టించారు. దీంతో అలిస్టర్ కుక్ 21, జెన్నింగ్స్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ పంపించారు. ఈ టైంలో కెప్టెన్ రూట్ తో కలిసి ఒలీ పోప్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ టైం తర్వాత పోప్ పాండ్యాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 4 వికెట్లకు ఇంగ్లండ్ 89 పరుగులు చేసింది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూల్ గా ఆడుతున్న ఇంగ్లాండ్…మూడో రోజు ఆట ముగిసే టైంకు 250 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే భారత ఆట తీరు మారకపోతే…ఈ టెస్ట్ కూడా సమర్పించుకోవాల్సిన పరిస్థితి.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy