కాంగ్రెస్ ఎప్పటికీ మారదు : మోడీ

modi3ప్రజల్లో లేని భయాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్ధితులపై ముంబైలో బీజేపీ కార్యకర్తలతో మాట్లాడిన మోడీ… ఎవరైతే రాజ్యాంగాన్ని తొక్కేశారో, దేశ ప్రజాస్వామాన్ని జైలు పాలు చేశారో ఇప్పుడు వాళ్లే రాజ్యాంగాన్ని శాసిస్తున్నాడంటూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారన్నారు. 1975 నాటి కాంగ్రెస్ ఆలోచనా విధానానికి, ప్రస్తుత కాంగ్రెస్ ఆలోచనా విధానానికి ఎటువంటి మార్పు లేదన్నారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేని కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు మోడీ. ఎమర్జెన్సీ సమయంలో కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని, రేడియోలో అతడి పాటలు, సినిమాలు బ్రాడ్ కాస్ట్ చేయలేదని మోడీ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ఫ్రీడం కోసం పోరాడిన వెటరన్ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కు శాల్యూట్ చేస్తున్నానని తెలిపారు. కులదీప్ తమను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి కావచ్చు, కానీ ఈ విషయంలో అతడికి వందనం చేస్తున్నానన్నారు. నేటితరం యువతకు ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో అవగాహన లేదని, ఫ్రీడం లేకుండా ఎలా జీవించారో నేటి యువతకు తెలియదన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవహేళన చేసిందన్నారు. కేవలం కాంగ్రెస్ ను విమర్శించేందుకు తాము బ్లాక్ డే జరపడం లేదని, నేటి యువతకు ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగందనే దానిపై అవగాహన కల్సిస్తున్నామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy