కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు: హరీశ్ రావు

cmపాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పరుగులు తీస్తున్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. కాంగ్రెస్ హయాంలో నాడు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంటే.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు జిల్లాలో ఇప్పటివరకు 6.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామని తెలిపారు. ఈ ఏడాది మరో 1.50లక్షల ఎకరాలకు నీటిని అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఆగస్టులో తుమ్మిళ్ల ప్రాజెక్టు ప్రారంభం, గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆర్డీఎస్ ఆయకట్టు నీటికోసం ఉద్యమ సమయంలో ఏడురోజులపాటు కేసీఆర్ పాదయాత్ర చేశారని, పాలమూరు రైతుల కష్టాలు సీఎంకు తెలుసని అన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.783 కోట్లతో పది నెలల రికార్డు సమయంలో పూర్తిచేయడానికి యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే యాసంగి నాటికి 87వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని ప్రకటించారు మంత్రి  హరీశ్. పాలమూరు జిల్లాలో వేసవి కాలంలోనూ చెరువులు మత్తళ్లు దూకడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇవి జరిగేవా? అని ప్రశ్నించారు. ఒకనాడు వలసల జిల్లాగా గుర్తింపు పొందిన పాలమూరు నేడు పచ్చని పొలాల జిల్లాగా మారడానికి  సీఎం కేసీఆర్ కృషే కారణమన్నారు.

శనివారం(జూన్-9) తెలంగాణభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కే దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వీఎం అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డిలు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, కే లక్ష్మారెడ్డి, పీ మహేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి హరీశ్‌రావు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అలంపూర్ నియోజకవర్గాలకు చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. TRSలో చేరిన దామోదర్‌రెడ్డి, అబ్రహాం, ఎడ్మ కృష్ణారెడ్డిలు..తర్వాత మంత్రులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని, బంగారు తెలంగాణగా మార్చుకుందామని సూచించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు సీఎం కేసీఆర్.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy