కాంగ్రెస్, టీడీపీ రైతులకు చుక్కులు చూపిస్తే..మేం చెక్కులు ఇస్తున్నాం

ktrతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా రెండో రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం (మే-11) రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. సిరిసిల్ల జిల్లా..గంభీరావుపేటలో రైతులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. గత 30 సంవత్సరాల్లో రైతులకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తే..తాము చెక్కులు ఇస్తున్నామన్నారు. 3 ఏళ్లలోనే రైతుబంధు పథకంతో ఎకరానికి రూ.4 వేలు చెక్కులు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టామన్న కేటీఆర్..సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకంతో రూ.100 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.

వచ్చే యాసంగి వరకు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అలాగే వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే రైతులకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy