కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన మనీష్ తివారీ

manish-tewari-congress-v6 newsఆర్మీపై సెన్సేషన్ కామెంట్స్ తో కాంట్రవర్శీ క్రియేట్ చేశారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. యూపీఏ -2 హయాంలో కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించిందని వచ్చిన ఆర్టికల్ లో వాస్తవముందన్నారు. మనీష్ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించగా…. బీజేపీ కూడా అపోజ్ చేసింది.

యూపీఏ హయాంలో ఆర్మీ కదలికలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 2012 జనవరి 16న ప్రభుత్వానికి సమాచారం లేకుండానే… హర్యానా నుంచి రెండు ఆర్మీ యూనిట్లు ఢిల్లీ వైపు అనుమానాస్పదంగా వచ్చాయని మనీష్ అన్నారు. ఓ బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్ చేశారు. దీనిపై అప్పట్లో వచ్చిన పేపర్ కథనం నిజమేనన్నారు. అప్పట్లో తాను రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్థాయీ సంఘంలో ఉన్నానన్నారు మనీష్.

మనీష్ చెబుతున్న సమయంలో ఆర్మీ చీఫ్ గా.. ప్రస్తుత కేంద్ర మంత్రి వీకే సింగ్ ఉన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆర్మీ ప్రయత్నించిందన్న అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి. అయితే.. మనీష్ వ్యాఖ్యలను తప్పుబట్టారు వీకే సింగ్. తన బుక్ లో దీనిపై క్లారిటీ ఇచ్చానన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం మనీష్ తివారీ వ్యాఖ్యలను ఖండించారు. సైన్యం అనుమానాస్పద కదలిక వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మనీష్ చెబుతున్న సమయంలో స్టాండింగ్ కమిటీలో ఎప్పుడూ ఈ ఇష్యూపై చర్చ జరగలేదన్నారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని మనీష్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. వీకే సింగ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి… ఇష్యూపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జేడీయూ నేతలు డిమాండ్ చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy