కాంగ్రెస్ నేత హత్య

manoj-congressమహారాష్ట్రలోని భివాండిలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత, ముంబై కార్పొరేటర్ మనోజ్ మహాత్రే(52)ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.మనోజ్ తన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. తర్వాత కత్తులతో కాంగ్రెస్ నేతను సుమారు పది సార్లు విచక్షణా రహితంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటనను అక్కడున్న స్థానికులు సెల్‌ఫోన్లలో తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మనోజ్ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy