కాంగ్రెస్ పాలనలో అన్నీ సమస్యలే : హరీష్

దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు మంత్రి హరీష్. ఆదివారం (ఆగస్టు-12) తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంట్ కోతలు గుర్తొస్తాయని.. ఎన్నికల్లో హామీ ఇవ్వని అంశాలను కూడా నెరవేర్చామన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు చూసి కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేండ్లలోనే 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించాం. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా.. కాంగ్రెస్ పాలన బాగుంటే సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉంటాయి. ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఇప్పుడు తెలంగాణ ఉంది. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా.. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తొస్తాయి. రైతులకు ఏ రాష్ట్రమైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందా.. అని ప్రశ్నించారు మంత్రి హరీష్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy