కాంగ్రెస్ ప్రజల పాలిట పిశాచి.. చౌరాస్తాలో నిలదీస్తా: కేసీఆర్

KCRకాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. పిశాచిలా, భూతంలా ఉందన్నారు. ప్రజల కష్టాలు పట్టని పార్టీ అని.. విలన్ నంబర్ వన్ అని విమర్శించారు. “శ్రీరాం సాగర్ ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తాను. చౌరాస్తాలో కాంగ్రెస్ ను ఎండగడతాను. ఈ క్షుద్ర రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారో.? విషపూరితంగా ప్రవర్తిస్తున్నారు. జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 తారీఖున చెప్పాను. తెలంగాణ దుస్థితికి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ అన్నాను. తెలంగాణ ప్రజల పాలిట పిశాచి.. బూతం కాంగ్రెస్. 1956లో ఆంధ్రాలో తెలంగాణను కలిపి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రధాని నెహ్రూ ఇక్కడి ప్రజల గోస పోసుకున్నారు. 1969లో 400 మంది చనిపోవడానికి.. ముల్కీ నిబంధనలను రద్దు చేసి.. నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టింది .. ఆయన కూతురు ఇందిరాగాంధీ. 2004లో రాష్ట్రం ఇస్తామని మళ్లీ వేల మంది చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్. శిఖండి పాత్ర పోషిస్తోంది.  విచిత్రమైన వైఖరి ఇది” అన్నారు కేసీఆర్.

అన్నింటిపై స్టే లు వేస్తూ.. ఇప్పటి వరకు వివిధ అంశాలపై 192 కేసులు వేశారన్నారు. పిల్ లు వేస్తున్న కాంగ్రెస్ పిల్లిలా అడ్డుతగులుతున్నారు. సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటే కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతోంది. కాంగ్రెస్ మొత్తం చరిత్రలో మీ ముఖాలకు ఆరు లక్షలకు నీళ్లు ఇచ్చారు. మీ చరిత్రలో 5 లక్షల నాలుగు వేల రూపాయలు మీరిచ్చారా.. రూ.70వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. 123పై మళ్లీ కేసు… చట్టం అయితే మళ్లీ కేసు వేశారన్నారు. మల్లన్న సాగర్ కు 625 అడుగుల ఎత్తులో ఉండే కొండపోచమ్మ  సాగర్..  ఉంది. అక్కడి మునిగేది నా నియోజకవర్గంలోని భూములు.. 4400 ఎకరాల భూమికి గాను.. 4200 ఎకరాల భూసేకరణ అయిపోయింది. మిగిలిన ఒక్క శాతం భూమి వేయకుండా ఆపుతుంది కాంగ్రెస్ పార్టీ. మీ కార్యకర్తలను అడ్డుపెట్టుకుని కొండపోచమ్మను ఆపగలరా.. ఆపుతారా… ప్రాజెక్టును ఆపడం ద్వారా ఓట్లు సంపాదించుకుంటారా. కొత్తగా సాధించుకున్న రాష్ట్రానికి చిన్నగా చేయొద్దు.. విషపూరితంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి.. తెలంగాణ రైతాంగాన్ని కోరుతున్నాను.


Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy