కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర ఇవాళ్టి నుంచే

Cong bus-yatraరాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన బస్సుయాత్ర రెండో విడత ఆదివారం(ఏప్రిల్-1) నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా ఫిబ్రవరి 26న చేవెళ్లలో చేపట్టిన బస్సుయాత్ర.. మార్చి 3న హుజూరాబాద్‌లో ముగిసింది. మధ్యలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగడంతో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రెండో విడత యాత్రను చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. అనుకున్న ప్రకారం.. ఆదివారం రామగుండంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రెండో విడత బస్సు యాత్ర మొదలు కానుంది.

రామగుండంలో మొదలయ్యే కాంగ్రెస్‌ బస్సు యాత్ర ఏప్రిల్‌ 2న పెద్దపల్లి, 3న మంథని, భూపాలపల్లి, 4న స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తి, 5న నర్సంపేట్, 6న పరకాల, వరంగల్‌ వెస్ట్, 7న ఇల్లెందు, పినపాక, 8న డోర్నకల్, మహబూబాబాద్, 9న భద్రాచలం ఆలయ దర్శనం, వెంకటాపురం మీటింగ్, ములుగులో యాత్ర, 10న వర్ధన్నపేట, వరంగల్‌ ఈస్ట్‌లలో కొనసాగుతుంది. వరంగల్‌లోనే రెండో విడత యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఈ బస్సుయాత్రను చేపట్టినట్టు నేతలు చెబుతున్నారు. రెండో విడత ముగిశాక 2, 3 రోజుల విరామం తర్వాత మరో విడత బస్సుయాత్రను చేపట్టనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy